సాధారణంగా చిలగడ దుంప పేరు వినగానే మనలో చాలా మందికి నోరూరుతుంది. రుచికరమైన చిలగడదుంప ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. కాబట్టి బత్తాయి తినడం వల్లనే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పోషక గని స్వీట్ పొటాటోస్ :
పోషక గని స్వీట్ పొటాటోస్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
రోగనిరోధక శక్తి :
చిలగడ దుంప తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్య కరమైన జీర్ణక్రియ :
Advertisement
చిలగడ దుంప ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల చిలగడ దుంప వినియోగం జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రేగు కదిలికను నియంత్రించడంలో ప్రయోజకనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం :
చిలగడదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో చాలా మేలు చేస్తుంది. అందువల్ల చిలగడదుంపను క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా గుండెను ఆరోగ్యంగాఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడం :
తీపి బంగాళదుంప ఒక రుచికరమైన కానీ తక్కువ కేలరీలు కలిగిన అధిక ఫైబర్ ఆహారం. దీనిని తినడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. అందువల్ల దీనిని తినడం ఆరోగ్యకరమైన బరువు నియంత్రణలో సహాయపడుతుందని చెబుతారు.