ఆస్ట్రేలియా క్రికెట్లో ఓ శకం ముగిసింది అనే చెప్పాలి. ఎందుకు అంటే..? స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు మ్యాచ్ లకు, వన్డేలకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకొన్నాడు. ఆ సమయంలోనే వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే వార్నర్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు.
Advertisement
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉందంటే క్రీడాకారులు రెండు రోజుల ముందే గ్రౌండ్ కి చేరుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ వార్నర్ మాత్రం.. హాలీవుడ్ హీరో రేంజ్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ కోసం చాపర్ లో వచ్చిన వార్నర్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరుడి పెళ్లికి వెళ్లిన వార్నర్.. చివరి నిమిషంలో మ్యాచ్ కోసం హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చాడు. తాను ఎక్కడైతే కెరీర్లో చివరి టెస్ట్ ఆడాడో.. అదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో .. థ్యాంక్స్ డేవ్ అని తనకు ఫేర్వెల్ చెప్పిన చోటే చాపర్ లో దిగిన వార్నర్.
Advertisement
క్రికెట్ లో హిస్టరీ లో ఇలాంటి ఎంట్రీ తొలిసారి జరిగింది. సాధారణంగా ఏ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా ప్లేయర్స్ కొన్ని గంటల ముందుగానే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉంటారు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఇలా మ్యాచ్ కు ఆలస్యమవుతోందంటూ ఏకంగా హెలికాప్టర్ లో నేరుగా గ్రౌండ్ లోనే దిగడం విశేషం.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!