ఈ సంక్రాంతికి తెలుగు దేశం పార్టీ తొలి జాబితాని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. సర్వేల ఆధారంగానే జాబితాలో ఎవరెవరు ఉండాలో చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారట. టీడీపీ నుంచి 20 నుండి 25 మందితో తొలి జాబితాని సంక్రాంతి సమయానికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ పాతిక స్థానాల్లోనూ వివాదాలకు తావులేని స్థానాలకు చోటు దక్కబోతోంది అని తెలుస్తోంది.
Advertisement
అయితే.. చంద్రబాబు నాయుడు ఇప్పటికే తొంభై స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారట. ఆయా నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు సూచన చేసారు. ఎన్నికల వ్యూహకర్తలు, పార్టీ శ్రేణులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ జాబితాని రూపొందించడం జరిగిందట. ఈ జాబిట్లో ఎక్కువ మంది గతంలో టికెట్లు పొందిన వారేనట. ఈ ఏడాదిలో ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి.
Advertisement
ఈసారి తెలుగు దేశం, జనసేన కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమితో బీజేపీ కూడా జట్టు కడుతుందా లేదా అనే క్లారిటీ సంక్రాంతి తరువాత రాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పొత్తు విషయమై బీజేపీ రాష్ట్ర రాజకీయ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపారట. పార్టీ జాతీయ నాయకత్వమే ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నాడని తెలుస్తోంది.