Home » భారత్ అఫ్ఘానిస్థాన్ తొలి టీ20.. 14 నెలల తర్వాత టీ20ల్లోకి రోహిత్…!

భారత్ అఫ్ఘానిస్థాన్ తొలి టీ20.. 14 నెలల తర్వాత టీ20ల్లోకి రోహిత్…!

by Sravya
Ad

సుమారు 14 నెలల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ T20 క్రికెట్లోకి వస్తున్నాడు. ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కూడా రీయంట్రీ ఇవ్వాలి. అయితే వ్యక్తిగత కారణాల వలన తొలి T20 మ్యాచ్ కి కోహ్లీ దూరమయ్యాడు. రెండు, మూడు T20 లకి కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. గురువారం జరిగే తొలి T20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయడానికి టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మతో పాటుగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా రాబోతున్నాడు.

Advertisement

Advertisement

విరాట్ కోహ్లీ రాకపోవడంతో హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మని తీసుకున్నారు. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా తో T20 సిరీస్ లో రాణించిన రింకు సింగ్ మరొకసారి ఫినిషర్ గా ఆడబోతున్నాడు. వికెట్ కీపర్ స్థానం కోసం సంజు శాంసన్ జితేష్ శర్మలు ఉన్నారు. హార్థిక పాండ్యా స్థానాన్ని శివం దుబేతో భర్తీ చేయబోతున్నారు. స్ట్రైక్ రేట్ శుభమన్ గిల్ కి తక్కువ ఉండడంతో బెంజ్ కి పరిమితమయ్యాడు. హర్షిదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ లని బౌలర్లుగా నియమించబోతున్నారు. కుల్దీప్ యాదవ్ అక్షర పటేల్ కి కూడా జట్టులో చోటు దక్కచ్చు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading