టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన రాయుడు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు. తోలుత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న రాయుడు మూడురోజులకే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించాడు. ఇది ఒక రకంగా తన కెరీర్ పై ఇంపాక్ట్ చూపొచ్చు అని అనిపించినా తాను మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు రాజకీయాలకు దూరమవుతున్నట్టు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. త్వరలో జరగనున్న ఇంటర్నేషనల్ టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతున్నట్టు రాయుడు ప్రకటించాడు. దీని కోసమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రొఫెషనల్ ఆటను ఆడే సమయంలో రాజకీయాల్లో ఉండొద్దని రాయుడు ట్వీట్ చేశాడు. రాయుడు నిర్ణయంపై రోహిత్ కూడా ఆనందం వ్యక్తం చేశాడట. రాయుడు ముంబై జట్టులోకి రావడానికి రోహిత్ కూడా సాదరంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
గత ఏడాది ఐపీఎల్లో రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. లీగ్ జరుగుతున్న సమయంలోనే ఇదే నా చివరి టోర్నీ అంటూ ప్రకటించాడు. ఆ సీజన్ లో ధోని సారథ్యంలో చెన్నై టైటిల్ సాధించింది. చెన్నై విజేతగా నిలవడంతో రాయుడు కీలక పాత్ర పోషించాడు. కాగా, ఆ ట్రోఫీని ధోని అంబటికి అంకితం చేయడంతో ట్రోఫీ అందుకొని రాయుడు ఎమోషనల్ అయ్యాడు. సీజన్ ముగిసిన తర్వాత గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాయుడు వైఎస్ఆర్సిపిలో అధికారికంగా చేరాడు. గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీ లేదా లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని ఆశపడ్డాడు. అటు సీఎం జగన్ కూడా రాయుడు సేవలు వినియోగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో రాయుడుకి పార్టీలో సముచిత స్థానాన్ని ఇచ్చేందుకు కూడా ముందుకువచ్చారు. కానీ రాయుడు ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నాడు.
Advertisement
అయితే రాయుడు యూటర్న్ తీసుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలో రిటైర్మెంట్ విషయంలోనూ ఇలాగే తొందరపడి యూటర్న్ తీసుకున్నాడు. మొత్తానికి రాయుడు రాజకీయాలను పక్కనపెట్టి గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు తలపడే ఈ టోర్నీలో ముంబై జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన రాయుడు పదేళ్లపాటు ఆ జట్టుకే ఆడాడు. రాయుడు తన కెరియర్ లో 2010 నుంచి 2017 మధ్యలో ముంబైకి ఆడాడు. ఈ క్రమంలో అతడు ముంబై సాధించిన మూడు ఐపీఎల్ ట్రోఫీల్లో భాగమయ్యాడు. ఆ తర్వాత 2018 ఐపీఎల్ వేలంలో చెన్నైకి మారాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.