Home » టీ20 ప్రపంచ కప్ మ్యాచుల షెడ్యూల్ అవుట్.. పాక్, ఇండియా మ్యాచ్ల వివరాలివే..!

టీ20 ప్రపంచ కప్ మ్యాచుల షెడ్యూల్ అవుట్.. పాక్, ఇండియా మ్యాచ్ల వివరాలివే..!

by Sravya
Ad

2024 పురుషుల టీ 20 ప్రపంచ కప్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకుందని, శుక్రవారం వెల్లడించింది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం 2024 పురుషుల T20 ప్రపంచ కప్ లో మార్క్యూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగబోతోంది. న్యూయార్క్ లోని ఐసెన్‌హోవర్ పార్క్ లో ఈ మ్యాచ్ జరగబోతోంది భారత్ మొదట మూడు మ్యాచ్లను కూడా న్యూయార్క్ లో ఆడబోతోంది. నాలుగో మ్యాచ్ ని ఫ్లోరిడాలో ఆడబోతోంది. జూన్ 8న బార్బడోస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా తో ఆడబోతుంది. యూఎస్ఏ వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ జూన్ 1న స్టార్ట్ అవ్వబోతోంది. మొదటి మ్యాచ్ లో యూఎస్ఏ కెనడాతో తలబడిపోతుంది. జూన్ 29న బార్బడోస్‌ లో జరిగే ఫైనల్ తో టోర్నీ అయితే ముగిస్తుంది. 55 మ్యాచ్లు వెస్టిండీస్ లోని 6 వేదికలపై నిర్వహించగా యూఎస్ఏ లో మూడు వేదికలు ఈ మ్యాచ్ లకి ఆదిత్య ఇవ్వబోతున్నాయి ఇక గ్రూపులు వివరాలను కూడా చూసేద్దాము. గ్రూప్ A ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ, గ్రూప్ B ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్. అలానే, గ్రూప్ సి న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా, గ్రూప్ D దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.

Advertisement

Advertisement

జూన్ 5న ఐర్లాండ్‌తో పాటుగా 9న పాకిస్థాన్‌, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో ఆడనుంది. పాకిస్థాన్ జూన్ 6న యూఎస్‌ఏతో, జూన్ 11న కెనడాతో, జూన్ 16న ఐర్లాండ్‌తో పాటుగా ఇతర మూడు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతాయి. 20 జట్లు పోటీపడనున్నాయి. ఈసారి నాలుగు జట్లను పెంచారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8 రౌండ్‌కు వెళ్తాయి. జట్లను నాలుగు చొప్పున రెండు గ్రూపులుగా చేస్తారు. A1, B2, C1, D2 ఒక గ్రూపుగా ఉంటే A2, B1, C2, D1 మరో గ్రూపుగా ఉంటాయి. ప్రతి సూపర్ 8 గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో వాళ్ళు సెమీ-ఫైనల్‌కు వెళ్తారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading