2023కు ప్రపంచం వీడ్కోలు పలికింది. నూతనోత్సాహంతో 2024లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే…. 2023లో విజయంతో ప్రారంభించి ఓటమితో ముగించింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో టీమిండియా ఎన్ని మ్యాచ్లు ఆడబోతుంది, షెడ్యూల్ ఏంటి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం…. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. జనవరి 3 నుంచి రెండో టెస్టును కేప్ టౌన్ వేదికగా ఆడనుంది.
దీంతో దక్షిణాఫ్రికా పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత టి20 సిరీస్ ను ఆఫ్గానిస్తాన్ తో జనవరి 11 నుంచి జనవరి 17 వరకు ఆడనుంది. ఈ సిరీస్ లో మూడు టి20 మ్యాచ్ లు జరుగుతాయి. అనంతరం ఇంగ్లాండ్ తో భారత్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 25 నుంచి మార్చి 11 వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతోంది. మార్చి, ఏప్రిల్, మేలో జరిగే ఈ లీగ్ కు సంబంధించి షెడ్యూల్ ఇంకా విడుదల చేయాల్సిఉంది. ఐపీఎల్ అనంతరం జూన్ 4 నుంచి జూన్ 30 వరకు వెస్టిండీస్ అమెరికా వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ లో పాల్గొననుంది.
Advertisement
అనంతరం శ్రీలంక వేదికగా జూలైలో 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచుల్లో టీమిండియా శ్రీలంకతో తలపడనుంది. ఆ తర్వాత భారత్ వేదికగా సెప్టెంబర్, అక్టోబర్ లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది. అలాగే అక్టోబర్, నవంబర్ నెలలో భారత్ లోని న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ను, ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్ తో టీమిండియా 2024 షెడ్యూల్ ని ముగిస్తుంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.