టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో, అల్లరితనంతో ప్రేక్షకులను ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటాడు. కోహ్లీ అతి చిన్న వయసులో తన అక్క చేతిలో ఎన్నో దెబ్బలు తిన్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిన్నతనంలో తనను కంట్రోల్ చేయడానికి తన అక్క భావన తనని ఎన్నోసార్లు కొట్టిందట. తెలిసి తెలియని వయసులో నేను ప్రతి ఒక్కరిని నువ్వు నువ్వు అని అనేవాడిని. ఆ విషయంలో మా అక్క చాలాసార్లు నాకు అలా నువ్వు నువ్వు అని పిలవకూడదని వార్నింగ్ ఇచ్చింది.
Advertisement
అయినా కూడా నేను వినకపోగా…. మా అక్కని కూడా నువ్వు నువ్వు అని పిలిచేవాడిని. దీంతో మా అక్కకి చాలా కోపం వచ్చి నన్ను చితక్కోట్టింది. ఇంకోసారి ఇలా మాట్లాడతావా అంటూ నన్ను బాగా కొట్టిందంటూ కోహ్లీ తన చిన్నతనం విషయాలను గుర్తు చేసుకుంటూ తెగ నవ్వుకున్నాడు. ఇక మా అక్క కొట్టినప్పటి నుంచి నేను అందరిని మర్యాదగా పిలవడం నేర్చుకున్నాను. అంతేకాకుండా చిన్న వయసులో నేను గాల్లోకి కరెన్సీ నోట్లను చింపి ఎగరవేసి డ్యాన్స్ చేయడం చూశాను. అది మైండ్ లో పెట్టుకున్న నేను ఓ పిచ్చి పని చేసి మళ్ళీ తన్నులు తిన్నాను.
మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మా అమ్మ సరుకులు తీసుకురమ్మని నాకు రూ. 50 రూపాయల నోటుని ఇచ్చింది. నేను సరుకులు తీసుకురాకుండా ఆ రూ. 50 రూపాయల నోటును చూసిన సంతోషంలో దానిని చింపి గాల్లో ఎగురవేసి డ్యాన్స్ చేశాను. ఈ విషయంలో కూడా ఇంటికి వెళ్ళాక నన్ను బాగా కొట్టారు అని కోహ్లీ తన చిన్ననాటి జ్ఞాపకాలను భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ తో జరిగిన సంభాషణలో కోహ్లీ ఈ విషయాలను పంచుకున్నాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.