ఇక ఇప్పుడు 2024 వచ్చేసింది 2024 కి ప్రపంచం స్వాగతం పలికేసింది. భారత్లో క్రేజ్ తెచ్చుకున్న క్రికెట్ కూడా కొత్త సంవత్సరం అద్భుతంగా సాగాలని క్రికెట్ కి సంబంధించిన ప్లాన్లు కూడా చేసేసారు. ఈ ఏడాది భారత జట్టు అద్బుతంగా రాణించి అసాధారణ విషయాలని సాధించినప్పటికీ వరల్డ్ కప్ ని అడుగు దూరంలో భారత్ కోల్పోయింది అది క్రికెట్ అభిమానులు అందరినీ కూడా ఎంతగానో బాధపడింది. విరాట్, రోహిత్ శర్మల కళ్ళనుండి నీళ్లు రావడం ప్రధాన నరేంద్ర మోడీ స్వయంగా టీమిండియా క్రికెటర్లని తీసుకువెళ్లి డ్రస్సింగ్ రూమ్ లో ఓదార్చడం ఇవన్నీ కూడా ఈ ఏడాది జరిగినవి వీటిని అసలు మర్చిపోలేము. అయితే ఇక 2024లో సిరీస్ మెగా టోర్నీ ల వివరాలని చూసేద్దాము వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి మరి ఎటువంటి ఆలస్యం లేకుండా వీటిని చూసేయండి.
Advertisement
టీ 20 సిరీస్ ఆఫ్ఘనిస్తాన్‌తో..
Advertisement
జనవరి 11న మొహాలీలో ఫస్ట్ టీ 20, జనవరి 14న ఇండోర్‌లో సెకండ్ టీ 20, జనవరి 17న బెంగళూరులో థర్డ్ టీ 20.
5 టెస్టుల సిరీస్…
జనవరి 25 నుంచి 29 వరకు తొలి టెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 02 నుంచి 06 వరకు రెండో టెస్టు విశాఖపట్నం, ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు మూడో టెస్టు రాజ్‌కోట్, ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు రాంచీ, మార్చి 07 నుంచి 11 దాకా ఐదో టెస్టు ధర్మశాల.
ఏప్రిల్- మే నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్
జూన్: టీ20 ప్రపంచకప్ (వెస్టిండీస్, USA లో)
జులైలో శ్రీలంకలో మూడు వన్డేలు, 3 టీ20లు. సెప్టెంబరులో బంగ్లాదేశ్ భారత్ కి. రెండు టెస్టులు, మూడు టీ20. అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్. ఇక నవంబర్, డిసెంబరుల లో ఆస్ట్రేలియా లో పర్యటించనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!