తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందడి మొదలైపోయింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలోచనలో పడ్డాయి అధికార వైసిపి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ పొలిటికల్ హీట్ ని పెంచింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని పార్టీ ఇన్చార్జీలుగా వేరే వాళ్ళని ప్రకటించారు. మొదటి విడతగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా అధికార పార్టీ ప్రకటించింది. ఇన్చార్జిల మార్పుతో వైసిపిలో మొదలైన అసంతృప్తి అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇంకాస్త పెరిగింది.
Advertisement
తాజాగా తాడికొండ నియోజకవర్గం టికెట్ పై ఆశలు వదులుకున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పలు వ్యాఖ్యలు చేశారు. తాడికొండలో వైసిపి చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో మేకతోటి సుచరిత కొత్తగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటుగా రామిరెడ్డి నందిగం, సురేష్ తదితరులు పాల్గొన్నారు తాడికొండ నియోజకవర్గంలో తనకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని కొంతకాలంగా ఇక్కడ రాజకీయాల్లో తాను పాలుపంచుకుంటున్నానని డొక్కా చెప్పారు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రశ్నించమని అంటూనే ఆయనని కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు.
Advertisement
2019 ఎన్నికల్లో మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయానని అలానే పత్తిపాడు లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత భవిష్యత్తులో ఎన్నికల్లోకి దూరంగా ఉండాలని అనుకున్నాను అని తెలిపారు. ఆర్థికంగా కూడా చితికి పోయాను అందుకే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ మధ్య తమను సంప్రదించకుండానే ప్రకటన కూడా చేశారని ఆయన చెప్పారు అలా పార్టీ బాధ్యతల్ని అప్పగించారని వారిని రోజుల్లోనే తనను తొలగించారని అన్నారు. పార్టీ సర్వేలో తనపై వ్యతిరేకత ఉందని తెలియదు అంటూ ఆగస్టు 24న తాడికొండ సమన్వయకర్త బాధ్యతను తొలగించారని చెప్పారు ఇటీవల మరోసారి వైసీపీ పెద్దలు ఈ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలు చేపట్టాలని కోరారని ఆయన చెప్పారు వైసిపి టికెట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకేనని పార్టీ పెద్దలు కాదు స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఇంతలో ఏమైందో తెలియదని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!