డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. వార్నర్ ఇప్పటికే అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నారు. అయితే వార్నర్ ఇంకో రెండు రోజుల్లో కెరియర్ లో చివరి టెస్టు ఆడబోతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెన్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన చేశారు. వన్డేలకి కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు ఇదే సరైన సమయం అని ఆయన అనుకుంటున్నాడు చెప్పారు. ఫామ్ ఫిట్నెస్ తో ఉంటే 2025లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ ఆడతానని చెప్పారు వార్నర్.
Advertisement
వన్డే క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న విషయం చెప్పారు. భారత్ లో ప్రపంచ కప్ ని సాధించాం అది ఎంతో గొప్ప విజయం వన్డేలకి కూడా వీడ్కోలు పలకడం సరైన నిర్ణయం గా భావిస్తున్నా అని చెప్పారు. అయితే జట్టు లో మరి కొందరికి అవకాశం లభించి మరింత ముందుకు వెళుతుంది అని వార్నర్ చెప్పారు. 2025 లో ఛాంపియన్ ట్రోఫీ ఉంది ఈ రెండేళ్ల లో ఫామ్ లో పరుగులు సాధిస్తుంటే జట్టుకి నేను అవసరం అని భావిస్తే అందుబాటు లో ఉంటారని వార్నర్ అన్నారు.
Advertisement
తన నిర్ణయం తన ఇష్టం మేరకే తీసుకున్నట్లు కూడా వార్నర్ చెప్పారు. మాకు ఎదురైన పరిస్థితుల్లో భారత్లో విజేతగా నిలబడటం ఒక అద్భుతం ప్రపంచ కప్ లో వరుసగా మేము రెండు మ్యాచ్లు ఓడిపోయాం. అప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తూ విజయాలను సాధించాం. దక్షిణాఫ్రికా తో జరిగిన సెమీ ఫైనల్ కమీన్స్ ఆట తీరు కెప్టెన్సీ బాగుందని చెప్పారు వార్నర్. ఆస్ట్రేలియా తరపున వన్డే లో అత్యధిక పరుగులు చేసిన ఆరవ బెటర్ డేవిడ్ వార్నర్. వార్నర్ 161 మ్యాచ్లో 45 సగటుతో 6932 రన్స్ని చేశారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!