దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాని తెరమీదకి తీసుకురావాలని చూస్తున్నారు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వ్యూహం డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది. కానీ తెలంగాణ హైకోర్టు రిలీజ్ ని నిలిపివేసింది చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సినిమాని తెరకెక్కించారని మూవీ రిలీజ్ అవ్వకుండా ఆపివేయాలని టిడిపి నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు ఈ మూవీలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు చెప్పింది. ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ని నిలిపివేసింది. జనవరి 11న ఈ మూవీని రిలీజ్ చేయకూడదని మేకర్స్ ని కోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement
తదుపరి విచారణ జనవరి 11 కి వాయిదా వేశారు. నటుడు శివాజీ వ్యూహం సినిమా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమ్మ వాళ్ళ గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న ఆర్జీవీ కి సినీ కెరియర్ ఇచ్చిందే కమ్మోడు అని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఆర్జీవికి జీవితం ఇచ్చింది కమ్మవాడే. ఆయన సహకారంతోనే సినిమాలకి వచ్చాడు ఆయన బిజినెస్ మాన్ అని అన్నాడు. చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళని జగన్ దగ్గరికి తీసుకుంటాడు అని శివాజీ అన్నారు. జగన్ ఫండింగ్ చేస్తున్నాడు కాబట్టి బాబుకి వ్యతిరేకంగా సినిమా చేసాడు. రేపు చంద్రబాబు ఫండింగ్ చేస్తే జగన్ కి వ్యతిరేకంగా సినిమా చేస్తాడని శివాజీ అన్నారు.
ఇవాళ హడావిడి చేస్తున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర విభజన రోజు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నారా..? అంటూ శివాజీ మండిపడ్డారు. ఆర్జీవి చెప్పే మాటలు వినే వాళ్లంతా పని పాట లేని పోరంబోకులు అని ఆగ్రహం వ్యక్తపరిచారు. భయం లేని ఆర్జీవికి త్వరలో భయం అంటే ఏంటో తెలుస్తుంది అని శివాజీ చెప్పారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని సినిమా తీసాడు. ఏం పీకాడు..? వైసీపీ ఫండింగ్ తో చానల్స్ నడుపుతున్నాడు. వాటి వ్యూయర్షిప్ కోసం పవన్ కళ్యాణ్ ని తిడుతున్నాడు అని శివాజీ అన్నాడు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!