MP Gorantla Madhav : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోనున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ అంశంపై స్వయంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారన్నారు. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని , అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని తెలిపారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం సీఎం జగన్ నిర్ణయిస్తారు…నేనెలా చెబుతాను?? అంటూ ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోనే ఉన్నా… ఎన్నికల్లో పోటీ చేయనని ఎలా చెబుతాను అని పేర్కొన్నారు. నా విషయంలో సీఎం జగన్ నిర్ణయమే తీసుకోలేదని వివరణ ఇచ్చారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. సీఎం జగన్ నిర్ణయం తీసుకోన్నప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా…ఎంపీని అవుతానని ఎలా చెబుతా? అంటూ క్లారిటీ ఇచ్చారు.
Advertisement
ఎవరు ఎక్కడినుంచి పోటీ చేయాలనే విషయంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. నిన్న పిలిపిస్తే వచ్చా…చిన్న పనులు ఉంటే వాటి విషయమై మాట్లాడాను…సీఎం జగన్ ను నేను కలవలేదన్నారు. నా సీటు విషయమై చర్చే జరగలేదు, ఇంకా క్లారిటీ రాలేదని వెల్లడించారు. నిర్ణయానికి మూడు, నాలుగు రోజులు సమయం తీసుకుంటారని అనుకుంటున్నానన్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!