Home » MS DHONI : పాకిస్థాన్‌ బిర్యానీలు తింటున్న ధోని..అందుకేనా ఇలా ?

MS DHONI : పాకిస్థాన్‌ బిర్యానీలు తింటున్న ధోని..అందుకేనా ఇలా ?

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. చాలామంది యువఆటగాళ్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటారు. మూడేళ్లక్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పకున్న ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ధోని కూడా ఆయన అభిమానులకు చాలా గౌరవం ఇస్తారు. రీసెంట్ గా ఓ ఈవెంట్లో ధోని మాట్లాడుతూ జుట్టు పెంచుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమని చెప్పాడు.

MS Dhoni suggests fan to go to Pakistan for best food

పొడవాటి జుట్టులో చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. అందుకే వారి కోసం పెంచుతున్నాను అని చెప్పాడు. ధోని ఏదైనా సలహా ఇస్తే అభిమానులు చేయకుండా ఉండరు. కానీ ఓ అభిమాని ధోని ఇచ్చిన సలహాను తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ధోని తన క్రికెట్ కెరీర్ లో చాలా సార్లు పాకిస్తాన్ లో పర్యటించాడు. అక్కడి వంటకాలను రుచి చూశాడు. పాకిస్తాన్ ఫుడ్ అంటే ఇష్టమని ధోని చాలాసార్లు పలు వేదికలపై చెప్పాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్లో మహేంద్రసింగ్ ధోని ఒక వ్యక్తితో మీరు ఒకసారి తినడానికి పాకిస్తాన్ వెళ్లండి అని చెప్పాడు.

Advertisement

ఆ అభిమాని మాత్రం ధోనీ ఇచ్చిన సలహాను సున్నితంగా తిరస్కరించాడు. మీరు మంచి ఆహారం సూచించిన నేను అక్కడికి వెళ్ళను. నాకు ఆహారం ఇష్టం. కానీ నేను అక్కడికి వెళ్ళను అని చెప్పాడు. అభిమాని అలా చెప్పడంతో ధోని పగలబడి నవ్వడం మనం చూడవచ్చు. ధోని పగలబడి నవ్విన వీడియోను ఇప్పటివరకు లక్షలాది మందికిపైగా వీక్షించారు. మరోవైపు ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరు పాకిస్తాన్ కి వెళ్లాలని అనుకోరు అని ఒకరు పోస్ట్ పెడితే…. బ్రదర్ మనం తిన్న తర్వాత తిరిగి ఇండియాకు రావాలి. బాంబు ఎక్కడ పెడతారో ఎవరికి తెలుసు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసుకున్నారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading