Home » భారత్ తో జరిగే రెండవ టెస్ట్ కు గెరాల్డ్ కోయెట్జీ దూరం..? కారణం ఏంటంటే?

భారత్ తో జరిగే రెండవ టెస్ట్ కు గెరాల్డ్ కోయెట్జీ దూరం..? కారణం ఏంటంటే?

by Srilakshmi Bharathi
Ad

దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కటి మంటతో బాధపడుతూ జనవరి 3 నుండి కేప్ టౌన్‌లో భారత్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల అతను ఇక్కడ ప్రారంభ టెస్ట్ సమయంలోనే ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. గత మూడు రోజుల మ్యాచ్ లో ఆ ఇబ్బంది తోనే ఆటని ఆడడంతో కటి మంట మరింత తీవ్రమైంది. “సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన మొదటి టెస్టులో పెల్విక్ ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ భారత్‌తో జరిగే రెండవ బెట్‌వే టెస్టుకు దూరమయ్యాడు” అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా ‘X’లో పోస్ట్ చేసింది.

Advertisement

Advertisement

రెండవ ఇన్నింగ్స్‌లో కోయెట్జీ కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. అతని జట్టు ఒక ఇన్నింగ్స్ మరియు 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులకు ఒక వికెట్‌తో ముగించాడు. కాగా, గత శుక్రవారం కోయెట్జీ తన గాయం తీవ్రతను తెలుసుకోవడం కోసం స్కానింగ్ కి కూడా వెళ్ళాడు. ఈ స్కానింగ్ లో గాయం మరింత తీవ్రమైనట్లు తేలింది. దక్షిణాఫ్రికా క్రికెట్ ఇంకా కోయెట్జీకి రీప్లేస్మెంట్ ను ప్రకటించనప్పటికీ.. కోయెట్జీకి విశ్రాంతిని ఇవ్వడం ముందు జాగ్రత్తగా చర్యగా భావిస్తోంది.

కెప్టెన్ టెంబా బావుమా ఇదే గాయంతో ఇబ్బందిని చవి చూసారు. ఇదే ఇబ్బందితో సిరీస్ నుంచి వైదొలుగుతున్న రెండవ దక్షిణాఫ్రికా క్రికెటర్ కోయెట్జీ. తన చివరి అంతర్జాతీయ సిరీస్‌ను ఆడుతున్న డీన్ ఎల్గర్ కేప్ టౌన్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అయితే.. కోయెట్జీ స్థానంలో దక్షిణాఫ్రికా తోటి పేసర్లు లుంగి ఎన్‌గిడి మరియు వియాన్ ముల్డర్‌లకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పట్టికలో 100% రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.

Visitors Are Also Reading