ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా నిలిచింది. ఈ ఈవెంట్ కోసం అంతర్జాతీయ షెడ్యూల్స్ సైతం మారుతుంటాయి. 2008 నుంచి 2023 వరకు 16 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్లో చాలానే మార్పులు చూడవచ్చు. ఈ లీగ్ లో స్టార్ ఆటగాళ్లు ఆడకపోవచ్చునే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అయితే ఆ గాయం నుంచి హార్దిక్ ఇంకా కోలుకోలేదని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ఆడనుంది.
Advertisement
ఈ సిరీస్ కు హార్దిక్ ఆడకపోవచ్చనే తెలుస్తుంది. దానికి కారణం పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దాంతో అతను ఐపీఎల్ కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రపంచకప్ లో టీమిండియాకు మహమ్మద్ షమీ ఆపద్బాంధవుడిగా పాత్రను పోషించాడు. కీలక మ్యాచ్ లో షమీ అవసరమైన చోట వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చడంలో తనదైన పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు షమీ ఫిట్నెస్ లేమితో బాధపడుతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా టూర్ కు దూరమయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే శమీ కూడా ఐపీఎల్ లో ఆడకపోవచ్చు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత సూర్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సూర్య వాకర్ సహాయంతో నడుస్తూ కనిపించాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ లో ఆడతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. గతేడాది ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోని మోకాలి నొప్పితోనే ఆడాడు. టోర్నీ అనంతరం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని నివేదికలు చెబుతున్నాయి. ధోని మెట్లు దిగేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడట. కాబట్టి ధోని ఐపిఎల్ లో ఆడతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక సొంత జట్టుతో ఉన్న విభేదాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ముజీబ్, ఫారుకి, పెసర్ నవీన్ ఉల్హాక్ ఐపీఎల్ సీజన్ లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ టోర్నిలో స్టార్ ఆటగాళ్లు ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.