సఫారీగడ్డపై టీమిండియా బిజీబిజీగా గడుపుతోంది. ఈ టూర్ లో భాగంగా మొదటగా టి20 సిరీస్లో 1-1తో సమంచేసింది. ఆ తర్వాత జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. కాగా, జనవరి 7న టీమ్ ఇండియా… సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తుంది. దక్షిణాఫ్రికా పర్యటన నుండి తిరిగివచ్చిన తర్వాత భారతజట్టు కొత్త సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 11 నుంచి భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టి20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.
తొలి టి20 మొహాలీలో జరగనుండగా…… రెండో టి20 జనవరి 14, 17 తేదీల్లో ఇండోర్ బెంగళూరులో జరుగుతాయి. అయితే రెండో టి20కి వేదికను మార్చవచ్చని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి గ్వాలియర్ లో కొత్తగా నిర్మించిన శంకర్ పూర్ స్టేడియానికి రెండో టి20 మ్యాచ్ వేదికను మార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వేదికలో ఎలాంటి మార్పులు లేవని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే గ్వాలియర్ లో చలి తీవ్రత ఎక్కువ. సాయంత్రం వేళల్లో మంచు కురుస్తుండడంతో అక్కడ మ్యాచ్ ఆడేందుకు అవకాశం లేదు. ఈ కారణంగానే మ్యాచ్ వేదిక మార్పు నిర్ణయాన్ని పక్కన పెట్టి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Advertisement
ఇదిలా ఉండగా….టీ20 సిరీస్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. ప్రపంచకప్ లో పాండ్య చీలమండ గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. టోర్నీ అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్ దక్షిణాఫ్రికా టూర్ కు కూడా హార్దిక్ దూరమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు హార్దిక్ కోలుకుంటాడని భావించినప్పటికీ…. తాజా రిపోర్ట్ ప్రకారం ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ కి కూడా హార్దిక్ అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.