CM JAGAN : మరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏ భార్యతోను ముచ్చటగా మూడు, నాలుగు ఏళ్లు కూడా కాపురం చేసి ఉండడని సీఎం జగన్ విమర్శించారు. “జగనన్న విద్యా దీవెన” పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేశారు సీఎం జగన్. భీమవరంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ మ్యారేజి స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను మంటగలుపుతున్నాడని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం విడాకులు ఇచ్చేయడం…. కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళు నాయకులైతే మిగతా వాళ్ళు కూడా ఈయనలాగే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Advertisement
“జగనన్న విద్యా దీవెన” పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ విద్యార్థులను ఆదుకుంటున్నట్లు చెప్పారు. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికానికి 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 583 కోట్లను నేడు తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. చదువు అన్నది తల రాతలు మార్చే ఒక ఆస్తి అన్నారు సీఎం జగన్.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!