Home » టీమిండియా ఘోర పరాజయానికి… 4 కారణాలు ఇవే..!

టీమిండియా ఘోర పరాజయానికి… 4 కారణాలు ఇవే..!

by Sravya
Ad

టెస్ట్ మ్యాచుల్లో టీమిండియా ఘోర పరాజయంతో ముగించేసింది. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ లో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. 163 పరుగులు లోటుతో రెండవ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలిపోయింది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 76 రన్స్ చేసాడు. 82 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్స్ తో 76 రన్స్ ని స్కోర్ చేయగలిగాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా తక్కువ రన్స్ కి అవుట్ అయిపోయారు అయితే ఎందుకు టీమిండియా ఈ మ్యాచ్లో ఓడిపోయింది..? దీని వెనక కారణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ముఖ్యంగా నాలుగు కారణాలు చూసేద్దాము.

Advertisement

టీమిండియా మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం టాస్ ఓడిపోవడం అని చెప్పొచ్చు. వర్షం అంతరాయం కలిగింది టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌత్ ఆఫ్రికా కి బాగా కలిసి వచ్చింది ఫేస్ కి అనుకూలంగా ఉన్న పిచ్ పై సౌతాఫ్రికా బౌలర్లు అదరగొట్టేసారు. వికెట్లని తీయగలిగారు. అలానే స్వింగ్ బౌలింగ్ కి భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు పిచ్ నుండి లభించిన సహకారాన్ని సఫారీ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు భారత బెటర్ ల బలహీనత ని టార్గెట్ చేస్తూ వికెట్లను పడగొట్టారు. టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దారుణంగా అవుట్ అయ్యారు.

Advertisement

రెండవ ఇన్నింగ్స్ లో కూడా అదే జరిగింది. రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఇద్దరూ నిలబడలేకపోయారు. బౌలర్లు కూడా చాలా తడబడ్డారు సౌత్ ఆఫ్రికా బౌలర్లు చెలరేగిన పిచ్ పై భారత్ బౌలర్లు తడబడ్డారు. ముఖేష్ కుమార్ ని కాకుండా ప్రసిద్ధ కృష్ణని తీసుకోవడం నష్టం కలిగించింది. షమీ లేని లోటు కూడా క్లియర్ గా తెలిసింది. టెస్ట్లకి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయలేకపోయారు క్రికెటర్లు. పిచ్ కండిషన్లకి తగ్గట్టుగా ఓపిక బ్యాటింగ్ చేయలేకపోయారు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. రాహుల్ కోహ్లీ పర్వాలేదు అనిపించిన సహకారం వాళ్ళకి లభించలేదు ఇలా ఈ కారణాల వలన టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిందని చెప్పొచ్చు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading