పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల మీద పూర్తి ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అందరూ కూడా ఏపీ రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉండనుంది అన్నది మాట్లాడుకుంటున్నారు. ఏపీ రాజకీయాలులో రోజుకో కొంత మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైయస్సార్ పార్టీ అభ్యర్థుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంటే ప్రధాన ప్రతిపక్షం అయిన టిడిపి నెమ్మదిగా రాజకీయాల్లో వెళ్తోంది. ఇప్పటికే టిడిపి జనసేనతో పొత్తులో ఉన్న విషయం తెలుసు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు ప్రకటించడం జరిగింది పార్టీల అధినేతల సీట్ల పంపకం గురించి పలుమార్లు భేటీ అయినా కూడా ఫలితం లేదు. జనసేన 40 నుండి 50 సీట్లు డిమాండ్ చేస్తుంటే 25 సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
సరిగ్గా ఆ టైంలోనే నారా లోకేష్ సీఎం పదవి గురించి కూడా మాట్లాడారు వీటన్నిటిని చూస్తే టిడిపి జనసేన పొత్తుల విభేదాలు తలెత్తేలా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి షేరింగ్ ఉండదని అనుభవం కలిగిన చంద్రబాబు ఐదేళ్లు సీఎం గా ఉంటారని ఒక మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ చెప్పారు పైగా ఉపముఖ్యమంత్రి పదవి కూడా దక్కడం కష్టమేనని తెలుస్తోంది. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి చెందారు పొత్తు అంటూనే మిత్రబృందాన్ని తుంగలో తొక్కారని టీడీపీ పై జనసేన కార్యకర్తలు కోప్పడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసేది లేదని జనసేన కార్యకర్తలు పోస్టులు కూడా పెడుతున్నారు. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ పై ఎదురు తిరుగుతున్నారు కాపులందరూ పవన్ ని నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు చంద్రబాబుకి పవన్ ఊడిగం చేస్తున్నారని అభిప్రాయం కాపుల్లో ఉంది వీటన్నిటిని చూసి పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని వెళ్తే కష్టమని చంద్రబాబు అనుకుంటున్నారు. జనసేన నుండి ఓట్లు అనుకున్నంత స్థాయిలో టిడిపికి బదిలీ కావని ఫిక్స్ అయిన చంద్రబాబు కొత్త రాజకీయ సమీకరణాలకి తలపెట్టే విధంగా కనబడుతోంది అందుకోసం కాంగ్రెస్తో జత కట్టడానికి కూడా చంద్రబాబు వెనుకడుగు వేయరని తెలుస్తోంది. చంద్రబాబు బిజెపిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేరు కాంగ్రెస్తో చేతులు కలపొచ్చు అని అంతా భావిస్తున్నారు.