Home » KL Rahul : కేఎల్ రాహుల్ ఆటలో మార్పు అదెలా సాధ్యమయ్యిందంటే ?

KL Rahul : కేఎల్ రాహుల్ ఆటలో మార్పు అదెలా సాధ్యమయ్యిందంటే ?

by Sravya
Ad

ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా ఒడిదుడుకులు కామన్. క్రికెటర్ లైఫ్ లో కూడా అంతే అప్పటిదాకా పొగడే వాళ్ళు పొగడ్తలను ఆపేసి విమర్శల్ని మొదలు పెడుతూ ఉంటారు. ఏది ఎప్పుడు జరుగుతుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. క్రికెటర్ కూడా ఫామ్ లో ఉంటే పొగుడుతారు ఫామ్ నుండి తొలగిపోతే విమర్శల్ని కురిపిస్తారు శతకాలతో చెలరేగిన ఆటగాడు ఘోరంగా విఫలం అవ్వచ్చు. టాప్ ప్లేయర్లు కూడా ఒక్కోసారి ఫామ్ నుండి తప్పిపోతూ ఉంటారు. కె ఎల్ రాహుల్ కూడా అదే ఫేస్ లో ఉన్నారు గాయం వలన కెరియర్ మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. తిరిగి ఆయన తన కెరియర్ లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.

KL Rahul batting

KL Rahul batting

రాహుల్ 2.0 వెర్షన్ అంటూ అభిమానులు మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఇప్పుడు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఐపీఎల్ 2023లో కేఎల్ రాహుల్ కి గాయం అయింది తర్వాత కెరియర్ లో ఇబ్బందులు వచ్చాయి గాయం నుండి కోలుకున్న తర్వాత ఫామ్ లోకి రావడం ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కష్టాల్లో ఉన్న ఇండియాని గట్టెక్కించడానికి ట్రై చేసాడు. తొలి రోజే టాప్ ఆర్డర్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా పడిపోయింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇతర ప్లేయర్లు అంతా కూడా అవుట్ అయిపోయారు. ఆ టైంలో రాహుల్ జట్టుకి అండగా నిలబడ్డాడు.

Advertisement

Advertisement

245 పరుగులు టీం ఇండియా చేసేలా రాహుల్ కష్టపడ్డాడు. తొలిరోజు వర్షం కారణంగా ఆట ముగిసే టైం కి 8 వికెట్లు నష్టానికి ఇండియా 128 పరుగులు చేసింది రెండవ రోజు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ సహాయంతో అర్థశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. 137 బంతుల్లో 14 ఫోర్లు నాలుగు సిక్స్ తో 101 పరుగులు చేశాడు మొత్తానికి ఇండియాకి మంచి స్టార్ట్ ని రాహుల్ అందించాడు. పైగా ఆటని బాగా ఎంజాయ్ చేసినట్లు కూడా వున్నాడు. సునీల్ గవాస్కర్ కేఎల్ రాహుల్ పై పోస్ట్ చేసి కేఎల్ రాహుల్ ని మెచ్చుకున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా కేఎల్ రాహుల్ ఆటపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading