ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తో టి20 మ్యాచ్ లు అలాగే వన్డే మ్యాచ్లు ఆడిన టీమిండియా జట్టు…. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 245 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
అంతేకాదు ఈ మ్యాచ్ లో కేల్ రాహుల్ మాత్రమే రాణించాడు. సెంచరీ తో దుమ్ము లేపాడు. అటు రెండవ రోజులో భాగంగా ఇవాళ… సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 248 పరుగులు చేసింది. అయితే భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్…. టెంబా బావుమా గాయపడ్డాడు. దీంతో అతను గ్రౌండ్ ను కూడా వీడాడు.
Advertisement
ఈ తరుణంలో బవుమా కెప్టెన్సీ పై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ గిబ్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను కెప్టెన్ గా కాదు… అసలు ఆటగాడిగా కూడా పనికిరాదని ఫైర్ అయ్యారు. అతడికి ఫిట్నెస్ లేకపోయినా ఎలా అవకాశాలు ఇస్తున్నారని మండిపడ్డారు గిబ్స్. ఫిట్నెస్ ట్రైనర్ శుక్రి కండ్రాడ్…. ఆటగాళ్ల ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టడం లేదని విరుచుకుపడ్డారు. ఇలాంటి ఆటగాళ్ల ను మ్యాచ్ ఆడించడం హాస్యాస్పదం అని గిబ్స్ విరుచుకుపడ్డారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.