వైఎస్ షర్మిల వస్తే రాని…జగన్ ఎవరికి భయపడరు అని పేర్కొన్నారు ఏపీ మంత్రి రోజా. తిరుపతిలో ఏపీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబుకు పవన్ తో కలిసినా 175 చోట్ల అభ్యర్ధుల దోరకడం లేదని పేర్కొంన్నారు. కుప్పంలో అయినా గెలవాలని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు.
వచ్చే ఎన్నికలలో చంద్రబాబును కుప్పం ప్రజలు పుట్ బాల్ ఆడుతారని ఎద్దేవా చేశారు. ముప్పైఎళ్ళుగా చంద్రబాబు కుప్పానికి ఏం చేశారు.. కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు. వైఎస్ షర్మిల రాకతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు..ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ నుంచైనా పోటీ చేయచ్చు…ప్రచారం చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు.సీఎం జగన్ ఎవరికి భయపడరని స్పష్టం చేశారు.
Advertisement
మా ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీకి టచ్ ఉన్నామని చెప్పుకోవడం వారి శునాకానందమే అంటూ ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి రోజా. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళడమే సీఎం జగన్ కు తెలుసు అన్నారు ఏపీ మంత్రి రోజా. సీఎం జగన్ అన్నను నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది…జగన్ ను కాదని వెళ్లాలనుకుంటే సూ***డ్ చేసుకున్నట్లే అని చురకలు అంటించారు ఏపీ మంత్రి రోజా. టికెట్ రానీ వాళ్ళకు సరైన విధంగా గౌరవం పార్టీ ఇస్తుందన్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!