న్యూజిలాండ్ లో ఇంగ్లాండ్ గెలిచింది. విజయ పతాకాన్ని ఎగురు వేశారు. ఆస్ట్రేలియా అహంకారం కూడా పోయింది. దక్షిణాఫ్రికాలో టీం ఇండియా ఎందుకు ఓడిపోతోంది..? గంగోలి, ధోని, విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్స్ ఉన్న సమయంలో కూడా దక్షిణాఫ్రికాలో టీం ఇండియా టెస్ట్ సిరీస్ గెలవ లేకపోవడానికి కారణం ఏంటి..? రోహిత్ శర్మ నుండి టీమిండియా ఫ్యాన్స్ సమాధానం చెప్పాలనుకునే ప్రశ్న. రోహిత్ సారధ్యంలో టీమిండియా ఇంకోసారి సౌతాఫ్రికా తో స్వదేశంలో తలపడనుంది. మంగళవారం నుండి సెంచూరియన్ లో రెండు టెస్టులు ప్రారంభం కాబోతున్నాయి.
Advertisement
ఈసారి టీమిండియా చరిత్రని సృష్టించగలద అన్న ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలో టీమ్ ఇండియా ఎందుకు విఫలం అవుతోందో ముందు చూద్దాం. దక్షిణాఫ్రికా పిచ్‌లు అన్ని ప్రాంతాల కంటే కూడా వేరుగా ఉంటాయి. ఇదే ప్రధాన కారణం. ప్రపంచంలోని అన్ని పిచ్‌ల కంటే ఇక్కడ ఎక్కువ బౌన్స్ ఉంటుంది. అలానే బంతి కూడా స్వింగ్, సీమ్ అవుతుంది. బంతి గాలిలో కదులుతుంది.
Advertisement
వికెట్ మీద పడ్డాక…. టీమిండియా బ్యాట్స్మెన్లకు ఇలాంటి పిచ్‌లకు అలవాటు లేదు. దీనితో దక్షిణాఫ్రికాలో తరచుగా ఫెయిల్ అవుతూ వుంటారు. అలానే, ఇండియా కేవలం ఒక్క బ్యాట్స్‌మెన్ పైనే ఆధారపడటమే ఇంకో కారణం. దక్షిణాఫ్రికా గడ్డపై 50 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీనే. ఇంకా ఎవరు కూడా సగటు 40 కంటే తక్కువ కాదు. దక్షిణాఫ్రికా బౌలర్లు భారతదేశ బౌలర్ల కంటే కొంచెం పొడుగ్గా వుంటారు. ఇది కూడా ఇంకో కారణం. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లకు తమ హోమ్ పిచ్‌లు వలన కాస్త ప్లస్ అవుతుంది. వారు ఈ పిచ్‌ల పై బాగా ఆడగలరు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!