Home » రెండు రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా బండ్ల గణేష్ ?

రెండు రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా బండ్ల గణేష్ ?

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పాలనపై అలాగే ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలపై దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Bandla Ganesh as Chief Minister of Telangana for two days

Bandla Ganesh as Chief Minister of Telangana for two days

గ్యాప్ లేకుండా ఉన్నత అధికారులతో భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే వరుస మీటింగ్లో నేపథ్యంలో రేవంత్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. రేవంత్ రెడ్డికి జ్వరం వచ్చినట్లు కూడా కొంతమంది వార్తలు క్రియేట్ చేశారు. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ స్పందించారు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, దయచేసి మీరు రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను అంటూ రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశాడు బండ్ల గణేష్.

Advertisement

ఈ మేరకు రేవంత్ రెడ్డి ని ట్యాగ్ చేసి మరి ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్ అలాగే భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు బండ్ల గణేష్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రెస్ట్ తీసుకుంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి అవుతావా ? రెండు రోజులపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా పని చేస్తావా అంటూ బండ్ల గణేష్ ను ఉద్దేశించి చురకల0టిస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading