ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లోనే జరగనున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికల తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకొని ప్రజలలోకి వెళ్తున్నాయి. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపిన తెలుగుదేశం పార్టీ… వైసిపి తరహాలో అఖండ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.
Advertisement
ఇలాంటి తరుణంలో సీఎం జగన్ కు షాక్ ఇచ్చేలా వైఎస్ షర్మిల ప్రవర్తించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల… తెలుగుదేశం పార్టీ నేతలకు క్రిస్మస్ గిఫ్టులు పంపించారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కు కూడా క్రిస్మస్ గిఫ్టులు పంపించారు వైయస్ షర్మిల. గతంలో టిడిపి నేతలను దారుణంగా తిట్టిన షర్మిల… ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శత్రువులైన వారిని మెచ్చుకుంటూ గిఫ్టులు పంపించింది.
అయితే ఈ అంశంపై వైసీపీ కార్యకర్త శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ పెట్టింది. షర్మిలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. నీకు ఆస్తిక్ అన్న ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదని. నువ్వు చెల్లెలు కాదు రాకాసి సూర్పనకా అంటూ చచ్చిపోయింది శ్రీ రెడ్డి. దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును చెందాల రూపంలో అడుక్కుతినే బతుకులు మీవి అంటూ వైఎస్ షర్మిల దుమ్ము దులిపింది శ్రీరెడ్డి. దీంతో శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ కావాలనే శ్రీరెడ్డితో షర్మిలను తిట్టించారని అటు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!