భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్రలోకి ఎక్కారు. 2011 వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ తో పాటుగా ఓ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు అందించారు. తన ఆట, మాట, నడవడిక అన్ని తనను భారత్ క్రికెట్ లో ఓ ప్రత్యేకతతో నిలబెట్టాయి. ధోని చివరిగా 2019 వన్డే ప్రపంచకప్ లో భారత్ తరఫున ఆడాడు. తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని ఈ 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ధోనికి ప్రస్తుతం 42 ఏళ్లు.
అతను ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రమే రాణిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఐపీఎల్ లోను ధోని సక్సెస్ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. చెన్నైకి అయిదు ట్రోఫీలు అందించిపెట్టాడు. కాగా, ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీకి ఇదే ప్రశ్న ఎదురయింది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. చాలామంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా క్రికెట్ అకాడమీ నిర్వహించడం, కోచ్ గా లేదా వ్యాపారం వైపు అడుగులు వేస్తారు. కానీ ధోని ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఏం చేస్తాడు అన్న ప్రశ్నకు ధోని ఇచ్చిన సమాధానం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. క్రికెట్ కు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించాక మిగతా సమయాన్ని ఆర్మీలో గడపాలని ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీకి తగిన సమయం కేటాయించలేకపోయాను. ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది.
Advertisement
Advertisement
అందుకే ఆర్మీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పాడు. ధోని చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని కి ఇండియన్ ఆర్మీ అరుదైన ఘనతను ఇచ్చి సత్కరించింది. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకులు ధోనిని నియమించింది. దీంతో ధోని 2015లో ట్రైనింగ్ క్యాంపులో, 2019లో జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తించాడు. చిన్నప్పటి నుంచి ఆర్మీని ఇష్టపడే ధోని రిటైర్మెంట్ తర్వాత తనకు ఇష్టమైన ఆర్మీలో గడపడం అభినందనీయం.