ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ టామ్ కరణ్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 1.5 కోట్లు వెచ్చించి ఆర్సిబి ఈ యంగ్ స్టార్ ను దక్కించుకుంది. అయితే వేలం ముగిసిన కొన్ని గంటల్లోనే అతను నిషేధానికి గురయ్యాడు. దీంతో ఆర్సిబి ఫ్రాంచైజీకి బిగ్ షాక్ తగిలినట్లు అయింది.
Advertisement
బిగ్ బాష్ స్టేజ్ లో ఆడుతున్న టామ్ కరన్ అంపైర్ తో గొడవ కారణంగా నాలుగు మ్యాచ్ల నిషేధానికి గురయ్యాడు. బిగ్ బాష్ స్టేజ్ లో భాగంగా హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ సిడ్ని సిక్సర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో టామ్ కరణ్ టీమ్ సిడ్నీ సిక్సర్స్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ లో టామ్ కరణ్ పదేపదే పిచ్ మీదుగా నడవడం నాలుగో అంపైర్ గమనించాడు. అలా చేయొద్దని ఎంపైర్ సింబాలిక్ గా సూచించారు.
దీంతో టామ్ కరణ్ ఆ ఎంపైర్ తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో పరిగెడుతూ అంపైర్ పైకి దూసుకొచ్చాడు. దాంతో ఆ అంపైర్ భయంతో పక్కకు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచు రిఫరీ సీరియస్ గా తీసుకున్నాడు. దాంతో కరణ్ పై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించాడు. దీంతో ఆర్సిబి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.