టిడిపికి రియల్ వారసులైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు టిడిపిని అప్పగించాలని డిమాండ్ చేశారు కేఏ పాల్. ఇవాళ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు కేఏ పాల్. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ….మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దాని ప్రభావం లేదు….. జగన్ ఓడిపోవాలని నేను ప్రేయర్ చేయలేదు ఆయన బాగుండాలి ఆయన నన్ను కలవాలి మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదరాలి అని ప్రేయర్ చేశానన్నారు.
Advertisement
చంద్రబాబు కళ్లు నెత్తికొచ్చాయి… నారా లోకేష్ ను ఎన్టీఆర్ తో పోల్చడం పాపం అన్నారు. లోకేష్ వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ ను చంపిందని ఫైర్ అయ్యారు కేఏ పాల్. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, లా మీటింగ్ ఉత్తరాంధ్రలో జరిగింది… కొందరు ఎన్టీ రామారావు తో లోకేష్ ను పోలిస్తున్నారని మండిపడ్డారు. ఇదేం పోలిక… కనీసం పెద్ద ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చండన్నారు.నేను సత్యం మాత్రమే మాట్లాడతానని పేర్కొన్నారు. చంద్రబాబుకు లోకేష్ కు 10 ప్రశ్నలు వేస్తున్న… ముఖ్యమంత్రి అయ్యేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిజమా కాదా ? అని నిలదీశారు.
ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం 50 కోట్లు అడిగారా లేదా ? అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా లోకేష్ ను చేస్తారా కాదా ? అని ప్రశ్నించారు. ఏపీ ని సింగపూర్ అని చెప్పి ఉప్పల ఆంధ్రాని వేశారు… ఇప్పుడున్న అప్పులను ఎలా తీరుస్తారో నాతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. జాబు రావాలంటే బాబు రావాలని అబద్ధాలు చెబుతున్నారు…60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇస్తారన్నారు. చంద్రబాబుకు బిల్ క్లింటన్, బిల్గేట్స్ ను నేనే పరిచయం చేశానని గుర్తు చేశారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.