ఐపీఎల్ 2024 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపిఎల్ 2024 టోర్నమెంటు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 19వ తేదీన ముగిసింది. అయితే ఐపీఎల్ మినీ వేలానికి ముందే ముంబై జట్టు కీలక మార్పులు చేసుకుంది.
రోహిత్ శర్మను పక్కకు జరిపి… గుజరాత్ జట్టు నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రకంపనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తాము ఆడబోమని సూర్యకుమార్ యాదవ్ మరియు బుమ్రా నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Advertisement
అయితే ఈ వార్తలపై స్వయంగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం స్పందించింది. తమ జట్టుకు సంబంధించిన ఏ ఒక్క ప్లేయర్ జట్టును ఈడటం లేదని తెలిపింది. ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ సమాచారం అని… దీన్ని ఎవరూ కూడా నమ్మవద్దని తెలిపింది ముంబై యాజమాన్యం. కొన్ని అనివార్య కారణాలవల్ల రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాల్సి వచ్చింది… అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశామని స్పష్టం చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.