Home » టీడీపీలో జనసేన విలీనం…ఏపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ?

టీడీపీలో జనసేన విలీనం…ఏపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ?

by Bunty
Ad

 

 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ…చంద్రబాబు నాయకత్వం పై అంత నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ తన పార్టీని టీడీపీలో కలపాలని ఎద్దేవా చేశారు.
టీడీపీకి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే సరిపోతుందని చురకలు అంటించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి.

Advertisement

లేదంటే పవన్ కళ్యాణ్ నే ముఖ్యమంత్రి అవుతాడని ఎందుకు ప్రకటించ లేకపోయారు ? అని నిలదీశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖంలో ఏమైనా ఆనందం కనిపించిందా ? అని ఫైర్ అయ్యారు. జగన్ ను అధికారంలో నుంచి దించాలని చంద్రబాబు అనుకుంటున్నాడు… ప్రజలు కాదన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన లేకపోతే ఎన్నికల్లోకి వెళ్ళలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడని చురకలు అంటించారు.

పవన్ కళ్యాణ్ కాళ్ళా వేళ్ళా పడి యువగళం కార్యక్రమంకు తీసుకువచ్చారని పేర్కొన్నారు. 2014-19 మధ్య టీడీపీతో పవన్ కళ్యాణ్… కమ్యూనికేషన్ గ్యాప్ అంటున్నాడన్నారు. ఆ గ్యాప్ దేని గురించి వచ్చింది?? ఇప్పుడు తీరిన ఆ గ్యాప్ ఏంటి అన్నారు. తెర వెనుక ఒప్పందం కుదిరింది అనేది వాస్తవం కాదా?? అని ఫైర్ అయ్యారు. తమ వర్గ ప్రయోజనాలను రక్షించుకోవడం కోసం అర్జెంటుగా అధికారం కావాలి… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీరికి అధికారం కావాలని మండిపడ్డారు. అందుకే వీళ్ళంతా ఆత్రంగా ఉన్నారన్నారు సజ్జల.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading