దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలం వేయడం జరిగింది. అయితే ఈ వేలంలో అనేక రికార్డులు నమోదు అయ్యాయి. సాధారణంగానే ఇండియన్ ఐపీఎల్ ను రిచ్ లీగ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఐసిసి నిర్వహించే టోర్నమెంట్స్ తో పోలిస్తే.. బీసీసీఐ నిర్వహించే టోర్నమెంట్స్ తోనే ఎక్కువ ఇన్ కం వస్తుంది. క్రికెట్ వరల్డ్ లోని అన్ని దేశాల సీనియర్ మరియు జూనియర్ ప్లేయర్స్ ఈ ఐపీఎల్ ఆడడానికి వస్తూ ఉంటారు. అది కూడా వారికి అనుభవంగా ఉపయోగపడుతుంది అన్న కారణంతో చాలా మంది ఐపీఎల్ ఆడడానికి ఇంటరెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్లేయర్స్ కోసం జట్లు కూడా భారీగానే ఖర్చు చేస్తూ ఉంటాయి.
Advertisement
తద్వారా ఐపీఎల్ లో ఖరీదైన ప్లేయర్స్ లిస్ట్ పెరుగుతూ వస్తోంది. ఇటీవల 2024 ఐపీఎల్ కోసం జరిగిన వేలంపాటలో కొత్త రికార్డ్స్ నమోదు అయ్యాయి. 2023 ఐపీఎల్ వరకు ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ కరన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించి ఉన్నాడు. 2023 ఐపీఎల్ లో అతను 18.5 కోట్ల రూపాయల ధర పలికాడు. అయితే.. ఆ రికార్డు ను 2024 ఐపీఎల్ లో ఇద్దరు ఆటగాళ్లు బ్రేక్ చేసారు. మిచెల్ స్టార్క్ (కోల్ కతా నైట్ రైడర్స్) 24.75 కోట్లతో టాప్ లో నిలిచారు. పాట్ కమ్మిన్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్) 20.5 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా, సామ్ కరన్ మూడవ స్థానంలో ఉన్నారు.
Advertisement
కామెరూన్ గ్రీన్ (ముంబయి ఇండియన్స్ ) 2023 సంవత్సరంలోనే 17.5 కోట్ల రూపాయలతో నాలుగవ స్థానంలో ఉన్నారు. ఇదే ఏడాది బెన్ స్టోక్ (చెన్నై సూపర్ కింగ్స్ ) 16.25 కోట్ల రూపాయలతో ఐదవ స్థానంలో ఉన్నారు. 2021 వ సంవత్సరంలో క్రిస్ మోరిస్ కూడా ఇదే మొత్తానికి సెలెక్ట్ అయ్యి ఆరవస్థానంలో నిలిచారు. 2023 వ సంవత్సరంలో నికోలస్ పూరాన్ (లక్నో సూపర్ జెయింట్స్ ) 16 కోట్ల రూపాయలకు ఎన్నిక అయ్యి ఏడవ స్థానంలో నిలిచారు. 2015 లో యువరాజ్ సింగ్ (ఢిల్లీ డేర్ డెవిలిస్)16 కోట్ల ధరతో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. 2020 లో పాట్ కమ్మిన్స్ (కోల్ కతా నైట్ రైడర్స్ ) 15.5 కోట్ల రూపాయలతో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. 2022 లో 15.25 కోట్ల రూపాయలతో ఇషాన్ కిషన్ (ముంబయి ఇండియన్స్) పదవ స్థానంలో నిలిచారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!