Mitchell Starc : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లు కళ్లు చెదిరేధరకు అమ్ముడయ్యారు. సన్రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్ల భారీ ధరకు పాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. అయితే పాట్ కమిన్స్ రికార్డును మిచెల్ స్టార్క్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతడిని కోల్కత్తా నైట్ రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం ఇదే విశేషం. అంటే..ఐపీఎల్ లో మిచెల్ స్టార్క్… ఒక్క బాల్ వేస్తే 7 లక్షలు వసూలు చేస్తాడన్నమాట.
ఇక ఈసారి వేలంలో జాక్పాట్ కొట్టిన వారిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఉన్నారు. హర్షల్ పటేల్ ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడికి అంత ధర లభించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రెండు కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన అతనికోసం పంజాబ్, గుజరాత్ టీమ్స్ పోటీపడ్డాయి. చివరకు ఆరు రేట్లు ఎక్కువ ధరతో పంజాబ్ టీం తప్పించుకుంది. 2021 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన హర్షల్ గత మూడు సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ సీజన్ వేలానికి ముందు హర్షల్ పటేల్ ను ఆర్సీబీ విడుదల చేసింది.
Advertisement
హర్షల్ పటేల్ గత సీజన్ లో 13 మ్యాచులలో 14 వికెట్లు తీయగా…. 2021 సీజన్ లో తన బౌలింగ్ తో దుమ్మురేపాడు. 15 మ్యాచులలో 32 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ ను గెలుచుకున్నాడు. డెత్ బౌలింగ్ తో పాటు డెడ్లీ, బౌన్సర్ వేయడంలో హర్షల్ పటేల్ స్పెషలిస్ట్. అతని ప్రతిభకు గుజరాత్ టైటాన్స్ 10 కోట్లు వెచ్చించేందుకు రెడీ అయ్యింది. లక్నో కూడా 11 కోట్లకు వేలంలోకి వచ్చింది. అయితే పంజాబ్ జట్టు అతనిపై నమ్మకం ఉంచి 11.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.