అనుకున్నట్టే ఆస్ట్రేలియా బ్యాటర్ వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్ ని సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దుబాయ్ లోని కోకా కోలా అరేనా వేదికగా జరుగుతున్న ఐపిఎల్ 2024 మినీ వేలంలో రూ. 6.80 కోట్ల భారీ ధర కి కొనుగోలు చేసింది రూపాయల రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతనిని చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీపడి సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే టీం ఓనర్ కావ్య టీం మేనేజ్మెంట్ పక్క ప్లాన్ తో హెడ్ ని తీసుకుంది.
Advertisement
సన్రైజర్స్ హైదరాబాద్ కి ఓవర్సీస్ బ్యాటర్ కావాలి. డేవిడ్ వార్నర్ జానీ బేర్ తర్వాత ఆ స్థాయి ఓపెనర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కి రాలేదు. గత సీజన్లో మయాంక్ అగర్వాల్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసినా సరిగా ఆడలేదు. అందుకని అలా ఆడగలిగే హెడ్ ని సన్రైజర్స్ టీమ్స్ సొంతం చేసుకుంది హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. ట్రావెల్స్ హెడ్ కి సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా ని విజేతగా నిలబెట్టిన హెడ్ కోసం పలు ఫ్రాంచైజ్ లు పోటీ పడ్డాయి కానీ ఆరంభంలో సన్రైజర్స్ మినహా ఇంకా ఏ ఫ్రాంచైజ్ పోటీ చేయలేదు.
Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ పోటీకి వచ్చింది. సన్రైజర్స్ ఎలా అయినా అతన్ని సొంతం చేసుకోవాలని ధర పెంచింది చెన్నై పోటీ పడడంతో హెడ్ ని ఫైనల్ గా హైదరాబాద్ 6.80 కోట్ల ధరతో కొనుగోలు చేసింది. హెడ్ ని తీసుకోవడం సన్రైజర్స్ హైదరాబాద్ కి కలిసి వస్తుందని అంతా అంటున్నారు. అతను పక్కాగా సరిపోతాడని అంటున్నారు. పార్ట్ టైం బౌలర్ గా కూడా జట్టుకి ఉపయోగపడతారని కూడా భావించారు. గతంలో ఆర్సిబి తరపున ఆడిన హెడ్ పది మ్యాచ్లలో 2005 పరుగులు చేశాడు బౌలింగ్లో రెండు వికెట్లు తీశాడు
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!