టీడీపీ, జనసేన పార్టీలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలో ఇవాళ మీడియాతో రోజా మాట్లాడారు. చంద్రబాబు నాయుడిపై బాంబు బ్లాస్ట్ జరిగినా, అరెస్టు అయినా ప్రజలు, టిడిపి పార్టీ వాళ్ళు కూడా ఆయన వెంట లేరని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుప్పం నుంచే కాక మరో నియోజకవర్గాన్ని కూడా వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి సీటు లేదు వీరికి సీటు లేదని మీడియా అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు.
Advertisement
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిస్తే ఏదో జరగుతోందని అనుకున్నంత సినిమా లేదని ఎద్దేవా చేశారు. పవర్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ చురకలు అంటించారు. అసలు నారా లోకేష్ పాదయాత్ర చేసాడా అని డౌట్ గా ఉందన్నారు.అతను పాదయాత్ర చేసినట్లు ఎక్కడా కూడా కనబడలేదు, వాళ్ళ తండ్రిని అరెస్టు చేస్తే భయపడి ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడని ఎద్దేవా చేసారు.
ఒక పాదయాత్రకు ఇన్ని బ్రేక్ లు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక లోకేష్ మాత్రమే అంటూ చురకలు అంటించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల ఆయన సామాజిక వర్గానికి కానీ ప్రజలకు ఏ మాత్రం ఒరిగిందేమీ లేదన్నారు.జనసైనికుల పై నాకు చాలా జాలి వేస్తోంది…ఆ జనసైనికుల రెండు చేతుల్లో రెండు జెండాలు మోయిస్తూ జెండా మోసే కూలీలుగా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా. పవన్ కల్యాణ్ కేవలం సినిమాలకే పనికొస్తాడు రాజకీయాలకు పనికిరాడు…జనసైనికులు మీరు అతని వెంట తిరిగి మీ జీవితాల్ని నాశనం చేసు కోవద్దని కోరారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!