Home » Vastu Tips: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటె.. అదృష్టం మీ వెంటే ఉంటుంది!

Vastu Tips: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటె.. అదృష్టం మీ వెంటే ఉంటుంది!

by Srilakshmi Bharathi
Ad

హిందువులు వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు అన్న సంగతి తెలిసిందే. ఇంటికి సంబంధించి ఏ విషయాన్నీ అయినా వాస్తు శాస్త్రం వివరిస్తుంది. అలాగే.. ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి? ఏవి ఎక్కడ పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాలన్నింటిని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచితే.. అవి ఇంట్లోని వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జిని పెంచుతాయట. ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు చూద్దాము.

Advertisement

ఇంట్లో రాత్రాణి మొక్క ఉంటె అది ఇంట్లో సువాసనను వెదజల్లేలా చేస్తుంది. ఆ సువాసన మానసిక ప్రశాంతతని తీసుకొస్తుంది. దంపతుల మధ్య సంతోషాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెంపొందేలా చేస్తుంది. ఈ మొక్క పూలు లేత పసుపు రంగులో ఉండి చాలా అందంగా కనిపిస్తాయి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ ని పారద్రోలుతాయి. అలాగే చంపా మొక్క కూడా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ ని బయటకు తోలేస్తుంది.

Advertisement

ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి తగాదాలు, గొడవలు లేకుండా చూస్తుంది. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులను కూడా తొలగించి.. శాంతి ని పెంపొందిస్తుంది. కుటుంబాన్ని అభివృద్ధి పధంలో తీసుకెళ్లేలా చేస్తుంది. మల్లె మొక్క అందరికి తెలిసినదే. మల్లె మొక్క లక్ష్మి దేవి రూపం. ఇది అమ్మవారికి ప్రీతికరం. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగే పారిజాతం మొక్కలు కూడా ఇంట్లో ఉంటె మంచిది. ఇది అందరి కోరికలను తీరుస్తుందని చెబుతుంటారు. ఈ మొక్క శ్రీ కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇది మానసిక ఆందోళనను తొలగించి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా చూస్తుంది.

 

Visitors Are Also Reading