ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ…..రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అనుకునేలా అభిమానులు ఫీల్ అయ్యేవారు. ఆడినంత కాలం కెప్టెన్ గానే కొనసాగుతాడని అనుకున్నారు. కానీ ఫ్రాంచైజీ మాత్రం భవిష్యత్తు ప్లాన్స్ పేరుతో హిట్ మ్యాన్ పక్కన పెట్టేసింది. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగించింది. దీంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమంది అయితే హిట్ మ్యాన్ కు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదుసార్లు చాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ కు 2024లోను కెప్టెన్సీ ఇవ్వాలని అంటున్నారు.
కెప్టెన్సీ నుంచి హిట్ మాన్ తప్పించడంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్లపైన కెప్టెన్సీ మార్పు ప్రభావం కనిపిస్తోంది. రోహిత్ ను సారధ్య బాధ్యతల నుంచి తప్పించారని తెలియగానే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఇంతకాలం హిట్ మ్యాన్ కోసమే ముంబై ఇండియన్స్ ను ఫాలో అయ్యామని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. రోహిత్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎక్స్ లో ముంబైకి 8.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ముంబైకి రోహిత్ కెప్టెన్ కాదనే వార్త తెలిసాక ఫాలోవర్స్ సంఖ్య 8.2 మిలియన్లకు తగ్గిందంటే దాదాపు నాలుగు లక్షల మంది అభిమానులు ముంబై ఇండియన్స్ కు సెలవు చెప్పినట్లే.
Advertisement
Advertisement
ఇన్ స్టాగ్రామ్ లోను ముంబై ఇండియన్స్ ఫాలోవర్స్ సంఖ్య తగ్గిపోయింది. ఇన్ స్టాలో ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న జట్టు కాస్త ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. పాండ్యాను కెప్టెన్ ను చేయకముందు 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 12.7 మిలియన్లకు తగ్గిందంటే అన్ ఫాలో చేసిన వారి సంఖ్య నాలుగు లక్షలు అన్నమాట. రెండవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానానికి చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే సీఎస్కే ఫాలోవర్స్ భారీగా పెరిగారు. 13 మిలియన్ల నుంచి 13.1 మిలియన్లకు ఫాలోవర్స్ సంఖ్య చేరింది. ముందుముందు ముంబై ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందోనని ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ గా రోహిత్ బాధ్యతలు నిర్వహించడని తెలిస్తేనే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఒకవేళ ఐపీఎల్ కు హిట్ మాన్ బై చెబితే పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.