Home » రేవంత్ రెడ్డి తెలంగాణ కి సీఎం అయితే ఏపీలోని భీమవరం లో ఎందుకు సంబరాలు చేసుకున్నారు ? అక్కడే ఎందుకు ?

రేవంత్ రెడ్డి తెలంగాణ కి సీఎం అయితే ఏపీలోని భీమవరం లో ఎందుకు సంబరాలు చేసుకున్నారు ? అక్కడే ఎందుకు ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ విజయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అధికారంలోకి వచ్చామన్న సంతోషంతో గాంధీభవన్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సంబరాలు జరగడం విశేషం. అయితే.. ఏపీలో సంబరాలు జరిపింది ఏపీ కాంగ్రెస్ శ్రేణులు కాదు.

revanth-celebratrions

Advertisement

Advertisement

 

తెలంగాణాలో రేవంత్ రెడ్డి శ్రమకి తగ్గ ఫలితం వచ్చిందని.. కాంగ్రెస్ గెలిచిందన్న సంతోషంలో ఆయన వియ్యంకుడు, కూతురు నైమిశ రెడ్డి, అల్లుడు శివారెడ్డి సంబరాలు జరిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నివసిస్తున్న రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి కుటుంబం ఇంట్లోనే సంబరాలు షురూ చేసారు. ఇంటి వద్దే బంధువులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో బాణా సంచా కాల్చి, స్వీట్లని పంచి పెట్టారు. అక్కడే హోసింగ్ బోర్డు కాలనీ ప్రజలతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. రేవంత్ రెడ్డి వియ్యంకుడు ఎవరో కాదు.. ఆయన రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత వెంకట రెడ్డి. ఆయన తన వియ్యంకుడు ఈ విజయం సాధించడంతో పూర్తి ఖుషీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు వెంకట్ రెడ్డి, నైమిషా రెడ్డి, శివా రెడ్డి తమ కృతజ్ఞతలను తెలియచేస్తున్నారు.

Visitors Are Also Reading