క్రికెట్ ను దైవంగా భావించే దేశం మనది. బంతితో ఒకరు విధ్వంసం సృష్టిస్తే….బ్యాటింగ్ తో మరొకరు చెలరేగిపోతారు. జట్టు విజయమే ధ్యేయంగా దెబ్బలను సైతం లెక్కచేయరు ఆటగాళ్లు. 2011 ప్రపంచకప్ సమయంలో యువరాజ్ సింగ్ రక్తం కక్కుకుంటూ జట్టును ముందుకు నడిపించాడు. క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అదేమీ లెక్కచేయకుండా దేశం కోసం తాను అర్పించిన ప్రతి రక్తపు బొట్టు విజయతీరాలకు చేర్చింది. ఇలాంటి క్రికెటర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా టీమిండియాలో అలాంటి ఆటగాడు ప్రత్యక్షమయ్యాడు.
మూతికి తీవ్రమైన గాయమైనప్పటికీ ప్లాస్టర్ వేసుకుని వచ్చి జట్టును గెలిపించేందుకు అద్భుత పోరాటం చేశాడు. జట్టు కోసం అతడు చేసిన పోరాటానికి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ హీరో అయ్యాడు బాబ ఇంద్రజిత్. విజయ్ హజారే కప్ క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానులు బాబా ఇంద్రజిత్ పరిస్థితి చూసి చలించి పోయారు. మ్యాచ్ కి ముందు విరామం సమయంలో బాబా ఇంద్రజిత్ కింద పడటంతో పెదవి చిట్లింది. హర్యానాతో జరిగిన మ్యాచ్ లో 294 పరుగులకు 3 టికెట్లు కోల్పోయి 54 పరుగులకే కష్టాల్లో పడిపోయింది తమిళనాడు జట్టు.
Advertisement
ఆ సమయంలో ఇంద్రజిత్ నోటికి టేపు కట్టుకొని మైదానంలోకి దిగాడు. ఇంద్రజిత్ తాను జట్టు కోసం నొప్పిని సైతం లెక్క చేయలేదు. ఈ క్రమంలో 71 బంతులు 5 ఫోర్లతో 64 పరుగులు చేశాడు. కాగా, తమిళనాడు 63 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ ఇంద్రజిత్ క్రీడా స్ఫూర్తికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంద్రజిత్ కు ఏం జరిగిందో కీపర్ దినేష్ కార్తీక్ వివరించాడు. కిందపడి పైపెదవి చిట్లిందని, అయినప్పటికీ మూతికి ప్లాస్టర్ వేసుకుని తీవ్ర నొప్పితో ఆడేందుకు వచ్చాడని డీకే చెప్పాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.