టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి ఇప్పటికే మూడేళ్లు పైగా అవుతుంది. తనకి కెప్టెన్సీ తో పాటు ఆపద సమయంలో అవసరమైన పరుగులు చేస్తూ జట్టుకు అండగా ఉంటూ ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.
టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్ని ఘనతలు సాధించినటువంటి ధోనికి బీసీసీఐ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఇకపై ధోని వాడిన జెర్సీ నెంబర్ 7 ని మరి ఏ ఇతర క్రికెట్ వాడకుండా రిటై ర్ చేయనుంది. భారత క్రికెట్కు ఇతడు చేసిన సేవలకు గాను ఈ అరుదైన గౌరవం అతనికి ఇస్తున్నట్లు ఒక బీసీసీఐ అధికారి తెలిపారు.
Advertisement
ప్రస్తుతం ఉన్న టువంటి ప్లేయర్స్ కి 60 రకాల బేసీ సంఖ్యలను కేటాయించమని పేర్కొన్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ జెర్సీ నెంబర్10 ని బీసీసీఐ రీటైర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పీసర్ శార్దు ఠాగూర్ జెర్సీ నెంబర్ 10 ధరించడంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగాయి. దీంతో భారత జట్టులోని యువ ఆటగాళ్లు ఇకపై ఎవరు కూడా జెర్సీ నెంబర్ 7 మరియు 10 లను ధరించకూడదని పేర్కొంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.