తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండాల ని ప్రగతి భవన్ ను నిర్మించారు తెలంగాణ మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. 36 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రగతి భవన్ ను నిర్మించిన కేసీఆర్ దాదాపు తొమ్మిది ఏళ్లపాటు అక్కడే నివసించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజా భవనంగా మార్చారు.
ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా భవనంలోకి భట్టి విక్రమార్క ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా అత్యంత అరుదుగా కనిపించే ప్రగతి భవన్ లోపలి దృశ్యాలు బయటికి వచ్చాయి. ప్రగతి భవన్ లోపల భారీ హాళ్లు, విశాలవంతమైన డైనింగ్ ఏరియా అచ్చం ఒక మహారాజు నివసించే కోటలాగా ఉంది. ఇప్పుడు ప్రగతిభవన్ లోపలి దృశ్యాలు ప్రగతిభవన్ హోమ్ టూర్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
Advertisement
డిప్యూటీ సీఎం గృహప్రవేశం సందర్భంగా డెకరేషన్ చేయడానికి వచ్చిన వారే ఈ వీడియోలు తీసి ఉంటారని భావిస్తున్నారు. ప్రగతి భవన్ ను సీఎం కేవలం ప్రజాదర్బార్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు అంటూ ఇప్పటికే ప్రకటించగా…. ఆ భవనాల సముదాయంలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మాత్రం భట్టి విక్రమార్క, అతని కుటుంబ సభ్యులతో కలిసి నివసించనున్నారు.