Home » Cameron Green : భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న కామెరూన్ గ్రీన్…!

Cameron Green : భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న కామెరూన్ గ్రీన్…!

by Bunty
Ad

క్రికెటర్లకు అనారోగ్యాలు రావడం కామన్‌ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది అనారోగ్యం బారీన పడ్డారు. అయితే.. ఈ తరుణంలోనే.. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ తన ఆరోగ్యంపై సంచలన ప్రకటన చేశారు. తాను పుట్టుకతోనే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఒకానొక సమయంలో గ్రీన్ 12 ఏళ్లకు మించి బతకడని అనుకున్నట్టు తన తండ్రి చెప్పారు.

Advertisement

ఆస్ట్రేలియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో గ్రీన్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. బ్రేక్ సమయంలో అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడుతూ తన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. ఇది ఎక్కువమందికి తెలియదని చెప్పాడు. ఐదు దశలు ఉన్న ఈ వ్యాధి తనకు రెండవ స్టేజ్ లో ఉందని గ్రీన్ తెలిపాడు. తన తల్లి గర్భంతో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ ద్వారా ఈ విషయం తెలిసిందన్నాడు. ఈ వ్యాధి ఉన్నవారికి కిడ్నీ ఫంక్షనింగ్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందని గ్రీన్ తెలిపాడు.

ఐదవ దశకు ఈ వ్యాధి చేరుకుంటే డయాలసిస్ అవసరమని, ప్రస్తుతం తాను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నానని గ్రీన్ వెల్లడించాడు. తనకు ఈ వ్యాధి ఉందని చెప్పినప్పుడు జట్టు సభ్యులంతా ఆశ్చర్యపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓ ఆల్ రౌండర్ గా అంత వర్క్ లోడ్ ఎలా మేనేజ్ చేస్తున్నావని వారు అడిగారని గ్రీన్ వెల్లడించారు. తన వ్యాధి గురించి చెబుతున్నప్పుడు కూడా గ్రీన్ చాలా పాజిటివ్ స్పిరిట్ తో కనిపించాడు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading