గత కొన్ని రోజుల నుండి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ఇంట పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె కొడుకు వైయస్ రాజారెడ్డి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు అయితే వచ్చాయి. ఈ విషయంపై చాలా రోజుల నుండి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. రాజారెడ్డి ప్రియ అట్లూరితో ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం రాజారెడ్డి ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అయిపోయింది సో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
Advertisement
ప్రియ తో కలిసి ఉన్న ఫోటో బయటకి రావడంతో పెళ్లి వార్తలు నిజమేనని అంతా మాట్లాడుకున్నారు. ప్రియా కి విజయమ్మ చీర పెట్టి బంగారు గాజులు ఇచ్చారని కూడా తెలుస్తోంది. విజయమ్మ కూడా ప్రియా ని కలవడంతో వీళ్ళ పెళ్లి కన్ఫర్మ్ అయినట్లే అని అంతా అంటున్నారు. షర్మిల కాబోయే కోడలు ప్రియ గురించి అంతా ఆరా తీస్తున్నారు గతంలోనే ప్రియా రాజారెడ్డి కలిసి ఉన్న ఫోటో వచ్చింది. చట్నీస్ హోటల్స్ అధినేత తో అట్లూరి ప్రసాద్ మనవరాలు ప్రియా అట్లూరి బ్రదర్ అనిల్ స్నేహితుడు.
Advertisement
శ్రీనివాస్ అట్లూరి కూతురు అంటున్నారు. బ్రదర్ అనిల్ కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారుట. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్ కి కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని వార్తలయితే వస్తున్నాయి. ప్రియ తల్లిదండ్రులు అట్లూరి శ్రీనివాస్ మాధవి. జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు అని కొన్ని మీడియా సంస్థలు కూడా అంటున్నాయి. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారట. వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతోంది అని అంతా అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!