Home » చంద్రబాబు కి భువనేశ్వరికి పెళ్లి ప్రతిపాదన తెచ్చింది ఎవరు? బాబు నాన్నగారికి ఎన్టీఆర్ ఎందుకు క్షమించని కోరారు ?

చంద్రబాబు కి భువనేశ్వరికి పెళ్లి ప్రతిపాదన తెచ్చింది ఎవరు? బాబు నాన్నగారికి ఎన్టీఆర్ ఎందుకు క్షమించని కోరారు ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

నారా భువనేశ్వరి ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక ప్రముఖ వంశానికి చెందినవారు, N.T. రామారావు మరియు బసవతారకంల కుమార్తె. ఇక భర్త నారా చంద్రబాబు నాయుడికి పబ్లిక్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ నారా భువనేశ్వరి గారు చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. ఆవిడ ప్రతి నడవడిక, పని తీరు, మాటతీరుల్లో ఎన్టీఆర్ గారి పెంపకం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమా ఫీల్డ్ లో బాగా పేరు గడించిన ఎన్టీఆర్ రాజకీయ పరంగా కూడా రాణించాలని రాజకీయాల్లోకి కూడా వచ్చారు.

cbn-marriage

Advertisement

 

టీడీపీ పార్టీ లోనే కీలక వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కు, సిబిఎన్ కు మంచి బాండింగ్ కుదిరింది. చంద్రబాబు నాయుడు నిక్కచ్చితనం, నిజాయితీ, కమిట్మెంట్ వంటివి జయకృష్ణ గారికి బాగా నచ్చడంతో ఆయన తన సోదరి భువనేశ్వరికి చంద్రబాబు నాయుడు జంటగా సరిపోతారని భావించి.. ఈ విషయం గురించి ఎన్టీఆర్ తో చర్చిస్తారు. ఎన్టీఆర్ కూడా పాజిటివ్ గా స్పందించి చంద్రబాబు నాయుడుని పెళ్లి చూపులకు రావాల్సిందిగా పిలిచారట. చంద్రబాబు నాయుడు ఇంట్లో వారిని అడిగి వస్తానని చెప్పారట.

Advertisement

చెప్పినట్లుగానే పెళ్లి చూపులకు వచ్చిన చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ పెద్ద గజమాల వేసారుట. అయితే.. మొహమాటం కొద్దీ ఆ గజమాలని వేయించుకున్న చంద్రబాబు నాయుడు దాన్ని మొయ్యడానికి చాలానే కష్టపడ్డారట. అయితే.. పెళ్లి చూపుల సమయంలో భువనేశ్వరితో మాట్లాడిన చంద్రబాబు ఈ మంత్రి పదవి ఎంత కాలం ఉంటుందో తెలియదని.. తిరిగి ఏ పదవిని దక్కించుకోకపోతే నేను పల్లెటూరికి వెళ్లిపోవాల్సిందేనని చెబుతారు. అన్ని ఆలోచించుకుని ఇష్టమైతే ఒప్పుకోమని చెబుతారు. మా తండ్రి ఎప్పుడు ఒక మాట చెబుతుండేవారని.. భర్త ఎలాంటి పరిస్థితిల్లో ఉన్నా.. భార్య అతని వెంటే ఉండాలని.. ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తానని భువనేశ్వరి గారు“ చెప్పడంతో.. ఎన్టీఆర్ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం అదృష్టం అని చంద్రబాబు నాయుడు భావించారు. అలా వారి పెళ్లి భాజాలు మోగాయి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading