మోడరన్ డే క్రికెట్ లో క్రేజీ క్రికెటర్లలో ఒకరైన రిషబ్ పంత్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. దాదాపుగా ఇంకో మూడు నెలలు ఆగితే చాలు ఈ డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ ను మరోసారి మనమందరం క్రికెట్ గ్రౌండ్లో చూసేయొచ్చు. వచ్చే ఏడాది ఐపీఎల్ లో పంత్ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కన్ఫామ్ చేసింది. డిసెంబర్ 2022లో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబైలో సర్జరీ అవడం, అక్కడి నుంచి రికవరీ ప్రారంభించడం కూడా మనమందరం చూసాం.
తనకు ఉన్న పట్టుదలతో చాలా త్వరగా పంత్ రికవరీ అయ్యాడు. ప్రస్తుతం రెగ్యులర్ గా వర్కౌట్ వీడియోలు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ పంత్ నిజంగానే పూర్తి ఫిట్నెస్ సాధించాడా అంటే లేదనే చెప్పుకోవాలి. మరి ఐపీఎల్ లో ఎలా ఆడతాడని సందేహం వస్తుందా? ఇక్కడే ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ స్మార్ట్ నెస్ తెలుస్తోంది. పంత్ కోసం ఓ స్పెషల్ స్ట్రాటజీని రూపొందించినట్లు సమాచారం. అదేంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను వాడుకోవడం. 2023 ఐపీఎల్ నుంచి ఈ రూల్ ను తీసుకువచ్చారని తెలిసిందే కదా. దీనిని వాడుకొని పంత్ ను కేవలం బ్యాటింగ్ సమయంలో దించి సీజన్ అంతా ఆడించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా మనం కొన్ని సందర్భాలు చూసాం.
Advertisement
ఆర్సిబి కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ కు స్వల్ప గాయాలు అయినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేవాడు. ఈసారి పంత్ విషయంలో కూడా అదే జరగబోతుందని క్లియర్ గా తెలుస్తోంది. అదే సమయంలో ఈ సీజన్ తమను పంత్ ఏ లీడ్ చేయబోతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ స్పష్టం చేసింది. అయితే బీసీసీఐ అధికారులు ఫిట్నెస్ టీం క్లియరెన్స్ ఇస్తేనే పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడని, లేకపోతే కేవలం బ్యాటింగ్ మీదే ఫోకస్ ఉంటుందని ఢిల్లీ టీం వెల్లడించింది. ఒకవేళ పంత్ వికెట్ కీపింగ్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఈనెల 19న దుబాయ్ లో జరిగే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ వికెట్ కీపర్ బ్యాటర్ ను టార్గెట్ చేయకతప్పదు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!