ప్రస్తుతం ప్రణితి షిండే పేరు ఎక్కడ చూసినా వినపడుతోంది. ప్రియాంక రాహుల్ గాంధీల వెనక ఆమె కనపడింది. ప్రస్తుతం ఆమె టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. ఇక ఆమె ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి ఇలాంటి విషయాలు చూద్దాం. ఈమె పేరు ప్రణితి షిండే మహారాష్ట్ర సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే. మూడుసార్లు ఈమె గెలిచారు. మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. ఈమె వయసు 43 ఏళ్లు. ఆమె తండ్రి సుశీల్ కుమార్ షిండే అందరికీ సుపరిచితమే.
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆయనకి మొత్తం ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లలో ప్రణితి ఒకరు. ఆమె తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చింది. చాలా యాక్టివ్ పొలిటిషియన్. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ హై కమాండ్ పెద్దలతో పాటుగా ఇరుగుపొరుగు ఉన్న రాష్ట్రాల పార్టీ ముఖ్యలకి కూడా ఆహ్వానాలని పంపించారు.
Advertisement
Advertisement
ఈమె మహారాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్. అందుకని ఈమె అక్కడికి వచ్చారు. ఆ మధ్య కేసీఆర్ 600 వాహనాలతో అట్టహాసంగా పటాతోపంతో సోలాపూర్ కి ర్యాలీ వెళ్లారు. అయితే బిఆర్ఎస్ జాతీయ పార్టీ అయ్యాక దేశంలో ఎక్కడా కూడా పెద్ద యాక్సెప్టెన్సీ లభించలేదు. అప్పుడు ఆయన కన్ను మహారాష్ట్ర రాజకీయాల మీద పడింది. సోలాపూర్ పై కూడా కన్ను వేశారు అక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడి నుండి జాతీయ రాజకీయాలను నరుక్కురావాలని కేసీఆర్ అనుకున్నారు. 2014 2019 ఎన్నికల్లో ప్రణీతి గెలిచింది. ఇలా ఈమెకు తెలంగాణతో హైదరాబాద్ తో లింకు ఉన్నది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!