తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 02న ఏర్పడింది. అయితే నూతనంగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వరుసగా రెండుసార్లు కేసీఆర్ సీఎంగా కొనసాగారు.
Advertisement
కేసీఆర్ తరువాత డిసెంబర్ 07, 2023న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, రెండో సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ గతంలో టీడీపీలో కీలకంగా పని చేశారు. వేర్వేరు మార్గాల్లో వీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
కేసీఆర్ 2001లో టీడీపీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ గా నామకరణం చేశారు. కేసీఆర్ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చురుకుదనాన్ని గ్రహించిన ఎన్టీఆర్ టీడీపీలోకి ఆహ్వానించారు. 1983 నుండి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారు. టీడీపీ శ్రేణులకు శిక్షణ ఇచ్చే విషయంలో ఆనాడు కేసీఆర్ కీలకంగా వ్యవహరించేవారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆరు మాసాలకు, ఏడాదికి ఒక్కసారి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. 1999లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో దఫా అధికారాన్ని చేపట్టారు. ఆ సమయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఇతరత్రా కారణాలతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్ ని 2014లో తెలంగాణ తొలి సీఎంగా ఎన్నికున్నారు ప్రజలు.
Advertisement