క్రికెట్ లో ఏ టీం కు అయిన విజయాలు ఎక్కువగా రావాలంటే ఆ టీంలో స్టార్ ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండాలి. బ్యాటింగ్, బౌలింగ్లో జట్టుకు అవసరమైనప్పుడు రాణిస్తే జట్టుకు విజయంతో పాటు ఇతర ప్లేయర్స్ మీద ఒత్తిడి ఉండదు. కానీ టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ల కొరత ఉంది.
Advertisement
ఒకప్పుడు కపిల్ దేవ్ ఆల్ రౌండర్ గా భారీ విజయాలు అందించాడు. టీం ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఆల్ రౌండర్లుగా సేవలు అందించారు. కానీ వీరు రిటైర్ అయ్యాక ఇండియాలో ఉన్న ఒకే ఒక్క చెప్పుకోదగ్గ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. కానీ అతను తరచూ గాయాల పాలవుతూ ఫిట్నెస్ సమస్యతో జట్టుకు దూరమవుతున్నాడు.
ఇప్పుడు టీమిండియాకు మరో పాండ్యా అవసరం. కానీ త్వరలోనే పాండ్యా లాంటి ఆల్ రౌండర్ జాతీయ జట్టులో చేరే అవకాశం ఉంది. పాండ్యా లాంటి బ్యాటింగ్, మీడియం ఫేస్ బౌలింగ్, అదే దూకుడైనా కెప్టెన్సీతో రాణిస్తున్నాడు. భారత జట్టు అండర్-19 కెప్టెన్ అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం ఆసియాకప్ ఆడుతున్న అండర్-19 టీమిండియా జట్టుకు అర్షిన్ కులకర్ణి సారథ్యం వహిస్తున్నాడు. ఆసియాకప్ లో మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కులకర్ణి బౌలింగ్లో మూడు వికెట్లు తీశాడు. మెగా ఈవెంట్లో భారత్ కు మొదటి మ్యాచ్ లోనే విజయం అందించాడు. ఈ ప్లేయర్ వయసు 18 సంవత్సరాలు. మహారాష్ట్రలో పుట్టిన అర్షిన్ కులకర్ణి క్రికెటులో అద్భుతంగా రాణిస్తున్నాడు.
Advertisement
అండర్-19తో పాటు దేశవాళి క్రికెట్ లో కూడా ఈ యువ ప్లేయర్ రాణిస్తే త్వరలోనే ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వస్తుంది. ఐపీఎల్ లో ఛాన్స్ వచ్చి రానిస్తే టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడటం ఖాయం. ఐపీఎల్ లో రాణించే ఛాన్సులు కొట్టేసిన రింకూ సింగ్, తిలక్ వర్మ లాగా కులకర్ణి కూడా జాతీయ జట్టుకు ఆడే ఛాన్స్ ఉంది. ఇక అతని ఆట చూసిన మాజీలు టీమిండియా మరో హార్దిక్ పాండ్యా ఇతడేనని అభిప్రాయపడుతున్నారు. మరి కులకర్ణి రాణించి టీమిండియాలో పాండ్యాలాగా అవకాశం దక్కించుకుంటాడా లేదా అన్నది చూడాలి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.