కోట్లాదిమంది భారతీయుల మనసుల్లో నిలిచిపోయిన ధోని వరల్డ్ బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రపంచం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోనీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమే. టీమిండియాకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను టీమ్ ను ముందుకు నడిపించిన తీరు అద్భుతం అనడంలో సందేహం లేదు. ఎమ్మెస్ ధోని 2020లో రిటైర్మెంట్ ప్రకటించి ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెటర్ లో క్రికెట్ కు వీడ్కోలు పలికి మూడేళ్లు అయినా…. ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ఘనత దక్కించుకున్నాడు.
Advertisement
ఆటల్లోనే కాదు ఫిట్నెస్ విషయంలోను ఏ మాత్రం తగ్గడు. కుర్రాళ్లతో దీటుగా ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తూ ఉంటాడు. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూనే ఉన్నాడు. మొన్నటి వరకు ఈ ఏడాది ఐపిఎల్ లో ధోని ఉంటాడా లేదా అనే సందేహం ఉండేది. కానీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని పేరు చేర్చడంతో క్రికెట్ ఫ్యాన్స్ ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఐపీఎల్ 2024 ఆక్షన్ కి సమయం దగ్గర పడింది. ఈ పోటీకి సంబంధించిన వేలం డిసెంబర్ 19న జరగనుంది. ఇందుకోసం ఆయా ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.
Advertisement
తర్వాత ఐపీఎల్ సీజన్ కోసం మహేంద్రసింగ్ ధోని సిద్ధమవుతున్నాడు. ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో చెమటోడ్చుతున్నాడు. నల్లటి టీషర్టులో మహి జిమ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో అతను చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోని నాయకత్వంలో చెన్నై జట్టు మరోసారి టైటిల్ ను చేజిక్కించుకోవాలని ఎంతో ఆసక్తిగా చూస్తోంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ఆడుతున్న అతి కొద్దిమంది ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు.
అతడి నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. గత ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ…. అన్ని సహకరిస్తే మరో సీజన్ ఆడతనని మాట ఇచ్చాడు. అయితే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని అభిమానులు ఇన్ని రోజులుగా కంగారుపడుతూ వచ్చారు. కానీ ధోనిని ఈ ఏడాది కూడా చెన్నై రిటైన్ చేసుకుంది. ధోనితోపాటు రవీంద్ర జడేజా, అజింక్య రహానే వంటి ఆటగాళ్లను చెన్నై రిటైన్ చేసుకోగా…. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను విడుదల చేసింది.