తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. ఇక త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఫలితాలు ఏపీకి ఏం సందేశం ఇస్తున్నాయి..? ఏపీ మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు మనసులో అభిప్రాయం ఓటుతో స్పష్టం చేశారు. ఈ ఫలితాలు ఏపీలో మూడు ప్రధాన పార్టీలకి హెచ్చరికలా మారిపోయింది. వైసీపీ, టీడీపీ, జనసేన కి ఎటువంటి ఫలితాలు ఎదురు వస్తాయి..? తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఓటమి గురించి టీడీపీ శ్రేణులు జగన్ కి నష్టం కలిగిందని అభిప్రాయంలో ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు ఇక్కడ టీడీపీ కి మేలు చేస్తుందని అంటున్నారు. ఫలితాలు మాత్రం అసలు విషయం ఏంటనేది స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
టీడీపీ అక్కడ అసలు పోటీ చేయలేదు. టీడీపీ మద్దతుదారులు మాత్రం కాంగ్రెస్ కి అండగా నిలుస్తామని అన్నారు కొంతమంది టీడీపీ సన్నిహిత ప్రముఖులు హైదరాబాదులో ఏపీ మూలలు ఉన్న సెటిలర్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి అనుకూలంగా ప్రచారం చేయడం జరిగింది. గ్రేటర్ పరిధిలో సీమాంధ్ర మూలలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కుకట్పల్లి ఇలా పలుచోట్ల బిఆర్ఎస్ గెలిచింది. దీంతో టీడీపీ ప్రచారం చేస్తున్నట్లుగా చంద్రబాబు అరెస్టు టిడిపి శ్రేణుల హంగామా కేవలం ప్రచారానికే పరిమితమయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి పోటీ చేస్తున్నానని అన్నారు.
Advertisement
ప్రచారానికి వచ్చిన జనం ఓట్లు కూడా వేయలేదు బిజెపి కోసం పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు ఓడిపోయారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కి ఓట్లు పడలేదని తెలిసిపోయింది. ఏపీ మూలాలు ఉన్న కుటుంబాలే ఆ నియోజకవర్గాల్లో అక్కడ బీఆర్ఎస్ కి జై కొట్టాయి. అయితే బిజెపి ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉంది బిజెపి నేతలు ప్రచారం చేసిన ప్రాంతంలో పార్టీ ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఇక కెసిఆర్ పదేళ్ల పాలన పూర్తయిపోయింది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. కేసీఆర్ చెప్పిన డబల్ బెడ్ రూమ్ రూమ్ ఇల్లు రైతు రుణమాఫీ వంటివి పూర్తి చేయలేదు. టిడిపి మద్దతు ఇచ్చిన పార్టీకి పవన్ అభ్యర్థులకి ఓట్లు పడకపోవడంతో ఈ రెండు పార్టీలు కూడా డేంజర్ లో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!